Tuesday, March 23, 2010

కన్నీటి బాష ....

మనసున బాధ కన్నీరుగా మారినప్పుడు
పెదవి దాటి రావల్సిన మాట మూగపోయినప్పుడు
నా కన్నీరుకె బాష వస్తే
నా మనసున బాధ నీ మనసుకి చేర్చేది కాని...
బాష రాని కన్నీరు ఆవిరి అయ్యిపోయింది
మదిలో ని మాట మౌనంగా ఉండిపోయింది...

స్నేహం అంటే.....



వర్షించే మేఘానికి...నర్తించే నెమలికి ఉన్న బంధం
బాధపడే మనసుకి.... కన్నీరు కార్చే కనుల అనుబంధం
నిండు చంద్రుడిని చూసి.............అలలైఎగసే సంద్రంకి  కలిగే ఆనందం
వసంతం రాక తెలుసుకొని....చిగురించే మొలకల    సంబంధం






Thursday, March 18, 2010

నేస్తమా....


కమ్మని కలగా వచ్చి
పొంగే అల గ మారి
తీయని వలతో బంధించి.
వీడిపోతాను అనుకు నేస్తమా....